శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ ప్రొడక్షన్ ని అనౌన్స్ చేశారు. ఇది వారి విజయవంత చిత్ర నిర్మాణ ప్రయాణంలో మెయిన్ మైల్ స్టోన్ ని సూచిస్తుంది. ఈ మూవీలో 'రౌడీ బాయ్స్, లవ్ మీ' చిత్రాలలో నటనతో ఆకట్టుకున్న ఆశిష్ హీరోగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో న్యూ డైరెక్టర్ ఆదిత్యరావు గంగాసాని డెబ్యు చేస్తున్నారు.