94 యేళ్ళ దిలీప్ కుమార్ గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో పాటు వివిధ రకాల అనారోగ్య, వృద్దాప్యసమస్యలతో బాధపడుతున్నారు. దీనికితోడు డీహైడ్రేషన్, మూత్రనాళ సమస్యతో సతమతమవుతున్నారు. దీంతో ఆయనను బుధవారం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేర్చగా, ఆయనకు వైద్యులు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షల్లో దిలీప్‌కుమార్ కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని తేలింది. ప్రస్తుతం ఆయనను వైద్యుల పరిశీలనలో ఉంచామని, వెంటిలేటర్, డయాలసిస్ వంటి చికిత్సలను అందించడం లేదని, ప్రత్యేకంగా ఓ వైద్య బృందం చికిత్స అందిస్తున్నదని లీలావతి ఆస్పత్రి ఉపాధ్యక్షుడు అజయ్‌కుమార్ పాండే చెప్పారు.