టాలీవుడ్లో ఉన్న దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రంతో ఒక్కసారిగా ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత 'దువ్వాడ జగన్నాథం' (డీజే)తో ఫర్వాలేదనిపించాడు. ఇపుడు దాగుడు మూతలు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, హరీష్ శంకర్ చాలా నిర్వేదాన్ని ప్రదర్శించాడు.
బుధవారం 'లవర్' రిలీజ్ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్‌రాజు తన సినిమాల రిలీజ్ తేదీల్ని ప్రకటించారు. రాజ్‌తరుణ్ 'లవర్' చిత్రం ఈనెల 12న రిలీజవుతోంది. నితిన్ 'శ్రీనివాస కళ్యాణం' ఆగస్టు 9న రిలీజ్ చేస్తున్నాం. రామ్ సినిమా 'హలో గురు ప్రేమ కోసమే' దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వెంకీ-వరుణ్‌తేజ్ మల్టీస్టారర్ "ఎఫ్ 2" జనవరి 12న రిలీజవుతుంది. అటుపై 2019 ఏప్రిల్ 25న మహేష్ 5వ సినిమా రిలీజ్ చేస్తాం అంటూ వివరాలందించారు.
అదేసమయంలో 'దాగుడు మూతలు' చిత్రం ప్రస్తుతానికి వాయిదా పడిందనే సంకేతాలను దిల్ రాజు వెల్లడించారు. దీనిపై కాస్తంత నిర్వేదం ఫీలైన హరీష్ శంకర్.. తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. "ఈ జాబితా నుంచి నా సినిమా మిస్సయింది. కాస్త ఇబ్బందికరంగానే ఉంది. కానీ కొన్నిసార్లు కొన్ని తప్పవు.. అయితే ఆ ఐదు సినిమాల రిలీజ్‌లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నా" అని అన్నారు.