ప్రభాస్ - అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించే "కల్కి-2" చిత్రం ఈ యేడాది ఆఖరులో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ, 'కల్కి'లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసినట్టు చెప్పారు. 'కల్కి' సీక్వెల్‌లో అశ్వత్ధామ, కర్ణలదే సినిమా మొత్తం ఉంటుందని తెలిపారు. పైగా, 'కల్కి' తక్కువ సమయంలో తీసే చిత్రం కాదని చెప్పారు. భారీ బడ్జెట్, భారీ తారాగణం, సీజీ వర్క్ అధికంగా ఉండటం వల్ల చాలా సమయం పడుతుందని నాగ్ అశ్విన్ వెల్లడించారు.
మరోవైపు, హీరోలు నాని, విజయ్ దేవరకొండల అభిమానుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందిస్తూ, ఫ్యాన్స్ వార్ గురించి తనకు తెలియదన్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం సమయంలో విజయ్‌కు నాని సపోర్టుగా నిలిచేవారన్నారు. ప్రతి సన్నివేశాన్ని ఒకరికొకరు చర్చించుకుని నటించేవారని చెప్పారు. ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి చిత్రం ఇపుడు చేయడం కష్టమన్నారు.