టాలీవుడ్ హీరోలు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. తమ తదుపరి ప్రాజెక్టులను లైనప్‌లో పెట్టేందుకు వారు ఉవ్విళ్లూరుతున్నారు. ఢిఫరెంట్ జోనర్ కథలను ఎంపిక చేసుకుని వాటిని ఒకదాని తర్వాత ఒకటి లైనప్‌లో పెట్టేందుకు వీరు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా పలువురు యంగ్ హీరోలు పోటీపడుతున్నారు.
ముఖ్యంగా, ప్రభాస్ విషయానికి వస్తే హను రాఘవపూడి "ఫౌజి", సందీప్ రెడ్డి వంగా "స్పిరిట్", 'సలార్-2', 'కల్కి-2', ప్రశాంత్ వర్మ సినిమా ఇలా వచ్చే ఐదారేళ్లకు వరకు ఎలాంటి బ్రేక్ లేకుండా సినిమాలు చేయనున్నారు.
అలాగే, జూనియర్ ఎన్టీఆర్ "వార్-2", "డ్రాగన్", "దేవర-2" సినిమాలతో వచ్చే మూడేళ్ళ వరకు బిజీగా ఉండనున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ కోలీవుడ్ దర్శకుడు అట్లీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్‌లతో కలిసి పని చేయనున్నారు. అదేవిధంగా మహేశ్ బాబు దర్శకుడు రామజౌళితోనూ, రామ్ చరణ్ "ఆర్సీ-16" కోసం పని చేస్తున్నారు.