Brahmanandam, Raja Gautham, Rahul Yadav Nakka
బ్రహ్మా ఆనందం అనే చిత్రంలో బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి సావిత్రి,శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. నూతన దర్శకుడు Rvs నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.