బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్, వెన్నెల కిశోర్, ప్రియ, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్, రాజేశ్వరి తదితరులు నటించిన సినిమా బ్రహ్మా ఆనందం. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.
కథ:
బ్రహ్మా (రాజా గౌతమ్) తండ్రి వారసుడిగా థియేటర్ ఆర్టిస్ట్ కావాలని ట్రై చేస్తుంటాడు. ఢిల్లీ పరిషత్లో తన నాటకం ప్రదర్శించాలని కల. అక్కడ చేయాలంటే ఆరు లక్షలు కట్టాలి. దానికోసం ప్రేమించిన అమ్మాయితో కూడా మోసం చేయడంతో బెడిసికొడుతుంది. ఇక ఆరు లక్షలు కోసం స్నేహితుడు డాక్టర్ వెన్నెల కిశోర్ సాయంతో ఓల్డేజ్ హోంలో వున్న తన తాత ఆనంద మూర్తి(బ్రహ్మానందం) సాయం చేస్తాడంటే తన ఊరు వస్తాడు. కాని వచ్చాక తాత ఇచ్చిన ట్విస్ట్‌కు మతిపోతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
బ్రహ్మానందం తనయుడిని ప్రమోట్ చేయడానికి తీసిన సినిమా. నాటకాల నేపధ్యంలో దర్శకుడు కథ తీసుకుని, సెకండ్ పార్ట్‌లో కథ మలుపు తిరుగుంది. అది సినిమాలో కీలక అంశం. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయాలు, బ్రహ్మనందం కష్టాలు, థియేటర్ ప్లే ఛాన్స్ రావడం, ఆనంద్ రామ్మూర్తి ఓల్డ్ ఏజ్ హోమ్, అన్నయ్య- తాతయ్య మీద రాశి ప్రేమ, డబ్బుల కోసం ఆనంద్ రామ్మూర్తి వెంట బ్రహ్మానందం ఊరికి వెళ్లడంతో సాగుతుంది. ఊరికి వెళ్ళాక ఇంటర్వెల్‌కి తాత ఓ ట్విస్ట్ ఇవ్వడంతో సెకెండ్ హాఫ్ పైన మరింత ఆసక్తి పెరుగుతుంది. ఆ ట్విస్ట్‌తో బ్రహ్మానందం అక్కడే ఇరుక్కుపోవడం, తాత కోసం ఏం చేసాడనేది ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్‌గా కామెడీతోనే నడిపించి అక్కడక్కడా చిన్న ఎమోషన్ చూపించారు. ఇక సెకండ్ హాఫ్‌లో నవ్విస్తూనే... ముసలి వాళ్ళ ఎమోషన్, వాళ్ళ కష్టాలు, మనుషులతో అనుబంధాలు... ఎమోషన్‌ను ఎక్కువగా క్యారీ చేసారు.
రాజా గౌతమ్ పాత్రను ఎన్ని ఎమోషన్స్ వచ్చినా మారని ఒక సెల్ఫిష్ క్యారెక్టర్‌లా పొట్రైట్ చేసారు. మంచి ఎమోషన్ నడిపించి ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ప్రమోషన్స్‌లో చెప్పినట్టు... సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకు కేవలం రాజా గౌతమ్ పాత్ర మాత్రమే గుర్తుండి పోతుంది. ఓ వైవిధ్యమైన హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో తెరకెక్కిన బ్రహ్మ ఆనందం... అందిరినీ ఆకట్టుకుంటుంది.
బ్రహ్మానందం ఈ సినిమాలో కూడా ఓ పక్క నవ్విస్తూనే కాస్త ఏడిపించారు. బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గతంలో హీరోగా పలు సినిమాలు చేసినా అంత గుర్తింపు రాని రాజా గౌతమ్ ఈ సినిమాలో నటుడిగా తన కసి అంతా తీర్చుకున్నట్టు, నటనలో ఎంతో పరిణీతి చెందినట్టు అనిపిస్తుంది. రాజా గౌతమ్ తండ్రికి ధీటుగా ప్రతి సన్నివేశంలోనూ బాగా నటించాడు అని చెప్పొచ్చు.
ఇక వెన్నెల కిషోర్ కూడా ఫుల్‌గా నవ్వించారు. సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్ ప్రభాకర్ కూతురు దివిజ ప్రభాకర్ బ్రహ్మానందం మనవరాలి పాత్రలో మెప్పించింది. భవిష్యత్తులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. రాజీవ్ కనకాల, సంపత్, ఐశ్వర్య హోలక్కల్, ప్రియా వడ్లమాని, రాజేశ్వరి వారి పాత్రల్లో బాగా మెప్పించారు.
సాంకేతికంగా.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. పాటలు కూడా బాగున్నాయి. ఒక మంచి పాయింట్ చుట్టూ కామెడీ అల్లుకొని కథనం చాలా గ్రిప్పింగ్‌గా రాసుకుని నడిపించారు. క్లైమాక్స్ మరింత బలంగా రాసుకుంటే బాగుండేది. దర్శకుడు టైటిల్‌కి తగ్గ న్యాయం చేసాడనే చెప్పొచ్చు. నిర్మాత రాహుల్ యాదవ్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా వున్నాయి. టైం పాస్ సినిమా..