అల్లు అర్జున్ నటించిన చిత్రం "అల.. వైకుంఠపురములో". త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటించగా, నిర్మాతలు అల్లు అరవింద్, చినబాబులు నిర్మించారు.
అయితే, ఈ చిత్రంలోని ప్రతి పాటా సూపర్ హిట్టే. ముఖ్యంగా, 'సామజవరగమన', 'రాములో రాముల' పాటలు చిత్రం విడుదలకు ముందే హెద్ద హిట్. చిత్రం విడుదలైన తర్వాత 'బుట్టబొమ్మ' సాంగ్ అదిరిపోయింది. ఇది సోషల్ మీడియాలో ఓ ట్రెండ్‌ను సృష్టించిది. ఈ పాటకు అల్లు అర్జున్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు.