టాలీవుడ్ టాప్ స్టార్ కపుల్‌గా పేరొందిన సమంత, నాగచైతన్య విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కూడా స్నేహితులు లాగా, శ్రేయోభిలాషుల్లాగా ఉంటామని ప్రకటించారు.
ఇదిలా ఉంటే అక్కినేని నాగచైతన్య, సమంత ఓ సినిమా చేయబోతున్నారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాగచైతన్యకి, అటు సమంతకి అత్యంత సన్నిహితురాలైన ఓ మహిళ దర్శకురాలు గతంలోనే ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకొని, ఇద్దరికీ కథ వినిపించడం కూడా జరిగిందట.