మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగానికి పెద్ద దిక్కుగా వున్నారు. అలా వుండమని సినిమా పెద్దలు ఆయన్ను కోరారు. ఇది సత్యం. దర్శక రత్న దాసరి నారాయణరావు మరణానంతరం పరిశ్రమలో వున్న అంతరాలు, సమస్యలకు పెద్ద దిక్కుగా వుండమని సి.కళ్యాణ్‌తోపాటు పలువురు కోరారు. ఆ తర్వాతే ఆయన ముందుడగు వేశారు. ఆ సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత `మా` పనితీరుపై ఒకే పేనల్‌లో వున్న డా. రాజశేఖర్ రెడ్డితోపాటు పలువురు అధ్యక్షుడు సీనియర్ నరేశ్‌పై విమర్శలు కురిపించారు. అవి వాస్తవాలను ఆయన బల్లగుద్ది చెప్పారు. అయితే ఈ పేచీకు మధ్యవర్తిత్వం వహించడానికి వచ్చిన చిరంజీవి, మోహన్‌బాబు ఇతర పెద్దల సమక్షంలో డా. రాజశేఖర్ తీరు పెద్దలను అగౌరపరిచేదిగా వుండడంతో అప్పటికప్పుడు రాజశేఖర్‌పై యాక్షన్ తీసుకునేలా చర్యలు జరిగాయి.