మీ అమ్మాయిని హీరోయిన్ చేస్తారా? రోజాకు ఫ్యాన్స్ ప్రశ్నలు (video)

మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (15:55 IST)
ఫైర్ బ్రాండ్ రోజా ఏది చేసినా ప్రత్యేకమే. ప్రస్తుతం జబర్దస్త్ షోతో పాటు అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్న రోజా కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడిపేందుకే ప్రయత్నిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో అయితే కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా ఉన్నారు రోజా.
 
అంతేకాదు ప్రస్తుతం నియోజకవర్గ ప్రజలతో పాటు తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. తాజాగా ఆమె కూతురు అన్షుమాలిక పుట్టినరోజు వేడుకలను ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఎప్పుడూ తన భర్త సెల్వమణి ఫోటోలు, తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే రోజా ఇప్పుడు పిల్లల ఫోటోలను షేర్ చేస్తున్నారు.
 
తన కుమార్తె, కుమారుడిని ఆప్యాయంగా హత్తుకుని నవ్వుతూ రోజా ఫోటోలను షేర్ చేశారు. అసలే ఎంతోమంది అభిమానులు ఉన్న రోజా సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసిన వెంటనే లైక్‌ల మీద లైక్‌లు కొడుతున్నారట. చాలామంది మీ అమ్మాయిని హీరోయిన్ చేస్తారా అంటూ సందేశాలు కూడా పంపించేస్తున్నారట.
 
అయితే అన్హుమాలిక ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న నేపథ్యంలో సినిమాల్లో తీసుకొచ్చే ఆలోచన రోజాకు ఏమాత్రం లేదట. తను రాజకీయాల్లోనే కొనసాగుతూ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే రోజా ఉన్నారట.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు