ఈ సందర్భంగా తన చిన్ననాటి సంఘటనలను, తాను కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన విధానాన్ని వివరించడంతో పాటు, తన స్నేహితులు ఎవరెవరు ఏఏ రంగాల్లో ఉన్నారు. వారు కూడా జీవితంలో ఎదగటానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించి, సన్మానపత్రం కూడా అందజేశారు.
‘ఈరోజుల్లో..’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటి.. ‘బస్టాప్’, ‘ప్రేమకథా చిత్రమ్’, ‘భలే భలే మగాడివోయ్’, ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘బాబు బంగారం’, ‘కొత్త జంట’. ‘ప్రతిరోజూ పండగే’ ‘మహానుభావుడు’, ‘పక్కా కమర్షియల్’ ఇలా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు మారుతి. ప్రస్తుతం ఆయన ఇండియన్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా ఓ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఘన విజయం సాధించి తమ స్నేహితుడు మారుతి కూడా ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా ఎదగాలని ఆయన స్నేహితులు ముక్త కంఠంతో కోరుకున్నారు. అలాగే ఈనెల 8న పుట్టిన రోజు జరుపుకుంటున్న మారుతికి అడ్వాన్స్‌డ్ బర్త్‌డే విషెస్ తెలియజేశారు.