ఆ తర్వాత సినిమాలు చేసుకుంటూ పోతున్నా. పెద్ద సక్సెస్‌లేదు. ఏవరేజ్‌గా నడిచిపోతుంది. అలాంటి సమయంలో గ్యాంగ్ లీడర్ సినిమాకు దర్శకుడు విక్రమ్ కె. కుమార్ విలన్‌గా అడిగారు. ఇప్పుడు అజిత్ సినిమాకూ ఆ చిత్ర దర్శకుడు నన్నే ఎంచుకున్నారు. నన్నే ఎందుకు అనే డౌట్ వచ్చింది. అదే వారికి చెబితే నీ బాడీ చూసి ఎంపికచేశామన్నారు. ఇదే విషయాన్ని మొదట్లో ఆర్.ఎక్స్. 100 దర్శకుడు అజయ్ బూపతి కూడా ఇదే చెప్పారు. నేను కాలేజీలో వుండగా నా బాడీని చూసి అందరూ మెచ్చుకునేవారు. సో. అదే నాకు అవకాశాలు, ప్రేమను దక్కేలా చేసిందని వివరించారు.