సినిమాలో ప్రధాన తారాగణమంతా ఈ ట్రైలర్లో చూడొచ్చు. సింగిల్ మదర్ నీనా, ఆమె కుమార్తె నికిత, వారి సమీపంలో ఉండే ఇరుగుపొరుగువాళ్లు, సామాజికమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న మేజర్ ఉన్నికృష్ణన్, సంతోషంగా ఉండే అదృష్ణవంతుడైన యువకుడు అతనికి ఫ్రాడ్ అనే నిక్ నేమ్ కూడా ఉంటుంది. అతను సింగిల్ మదర్, ఆమె కుమార్తె ఉండే పక్క అపార్ట్మెంట్లోనే ఉంటుంటాడు. పరిణయం అనేది పెద్దలు కుదిర్చిన వివాహాలు, సింగిల్ పేరెంట్ అయిన మహిళ ఎదుర్కొనే సమస్యలు, ఆమె మధ్య వయసులో ప్రేమను కోరుకోవడం, ఇలా మన చుట్టూ చాలా మంది జీవితాల్లో ఉండే అనేక సమస్యలను గురించి తేలికైన పంథాలో తెలియజేస్తూ సాగే సినిమా. మధ్య తరగతి నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. మనుషుల మధ్య ఉండే బంధాలు, అనుబంధాలను ఏదో బలంగా చెబుతున్నట్లు కాకుండా తేలికగా, కొత్త కోణంలో, సెన్సిబుల్‌గా తెలియచేసేలా రూపొందించారు.
ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితులే. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన సురేశ్ గోపి, శోభన, ఊర్వశి, కేపీఏసీ లలిత తదితరులలో సమతూకంగా చేసిన బ్యాలెన్స్డ్ పెర్ఫామెన్సెస్ ఆకట్టుకుంటాయి. దీంతో పాటు నటీనటుల మధ్య సాగే రొమాన్స్, ఆకట్టుకునే హాస్యంతో పాటు ఆల్ఫోన్స్ జోసెస్ చక్కటి సంగీతం మెప్పిస్తుంది. ముఖేష్ మురళీధరన్ అందించిన విజువల్స్, టోబీ జాన్ ఎడిటింగ్ ప్రేక్షకులకు అద్భుతమైన సినిమా అనుభవాన్ని అందిస్తాయి.