వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం "మానాడు" ఫస్ట్ లుక్ మాస్ మహరాజా రవితేజ రిలీజ్ చేయనున్నారు. ఫిబ్రవరి 3, మధ్యాహ్నం 2.34 నిమిషాలకు రవితేజ 'మానాడు' టీజర్ రిలీజ్ చేయనున్నారు పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం. తమ చిత్రం 'మానాడు' తెలుగు టీజర్ ను తాజాగా 'క్రాక్'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ విడుదల చేయనుండడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.