పూరీ జగన్నాథ్‌తో ఈడీ దర్యాప్తు మొదలు

సోమవారం, 30 ఆగస్టు 2021 (19:11 IST)
సినితారల డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మొదలు కానుంది. డ్రగ్స్ కేసులో రేపటినుండి విచారణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రేపు ఈడీ ముందుకు డైరెక్టర్ పూరీజగన్నాధ్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 
 
ఇప్పటికే 12మంది సిని ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో 62 మందిని విచారించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్... మరికొంత మందిని విచారించడానికి రెడీ అయింది. డ్రగ్స్ కేసులో లబ్ధిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ కసరత్తులు చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
 
ఇప్పటీకే కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ క్రైం ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దాఖలు చేసిన ఈడీ... ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ సెక్షన్ 3,4 కింద కేసుల నమోదు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు