ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించినట్టుగా ఆదివారం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం అధికారులు స్పందించారు. ఇది ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ మీనాక్షి చౌదరిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇది పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పేరుతో తప్పుడు పోస్టులు పెడుతున్నవారిపై ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరించింది.
చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ ప్రభుత్వం గౌరవం పౌరసత్వం ఇస్తోందంటూ వార్తలు వచ్చాయి. త్వరలోనే ఆయన బ్రిటన్ పౌరసత్వం స్వీకరించబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. దీనిపై చిరంజీవి పీఆర్ టీమ్ స్పందించింది.