ఇత‌ర హీరోల అభిమానులూ నిజాయితీగా విజ‌యాన్ని చేకూర్చారు- బోయ‌పాటి శ్రీ‌ను

శనివారం, 12 మార్చి 2022 (22:55 IST)
Akhanda 100 days function
అఖండ వంద రోజుల‌ కృత‌జ్ఞ‌త‌ స‌భ శ‌నివారం రాత్రి క‌ర్నూలు న‌గ‌రంలోని ఎస్‌టి.బి.సి. కాలేజీలో.ఘ‌నంగా జ‌రిగింది.

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను మాట్లాడుతూ, నేను  తుల‌సి సినిమా చేశాక నాకు మూడో సినిమా ఓకే అయింది. ఎదురుగా బాల‌య్య వున్నారు. ఆయ‌న‌కు 90 సినిమాల హిస్ట‌రీ వుంది. ఆయ‌న పౌరాణికం, జాన‌ప‌దం, ఫ్యాక్ష‌న్‌, యాక్ష‌న్‌, ఫ్యామిలీ డ్రామాలు చేసేశారు. ఇప్పుడు ఏం చేసి ఫ్యాన్స్ ద‌గ్గ‌ర‌కు ఎలా రావాల‌నే ఆలోచ‌న‌లోంచి 2009లో సింహా మొద‌టి అడుగువేశాం. అలా. 2014లో లెజెండ్ తో రెండో అడుగు. 2021 అఖండతో మూడో అడుగు. మాది 13 ఏళ్ళ సుదీర్ఘ ప్ర‌యాణం. మా ప్ర‌తి సినిమా ప్ర‌యోగ‌మే. అభిమానులే మా సినిమాల‌ను ఆద‌రించి అద్భుత‌మైన విజయాలుగా మ‌లిచారు.  మీ కుటుంబ స‌భ్యుడిగా భావించారు. బాల‌య్య‌గారి బ‌లం మీరే. చ‌రిత్ర సృష్టించాల‌న్నా దాన్ని తిర‌గ‌రాయాల‌న్నా మీరే. ఇంత‌టి అభిమానాన్ని సంపాదించుకున్న బాల‌య్య‌బాబు గొప్ప వ్య‌క్తి. నా సుధీర్ష ప్ర‌యాణంలో స‌హ‌క‌రించిన న‌టీన‌టుల‌కు, సాంకేతిక సిబ్బందికి పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా.

అఖండ‌ను బాల‌య్య‌గారి అభిమానుల‌తోపాటు ఇత‌ర హీరోల అభిమానులు కూడా చాలా నిజాయితీగా అఖండ విజ‌యాన్ని చేకూర్చారు. సామాన్య‌ల‌నుండి పండితులు, పిల్ల‌ల‌నుంచి పెద్ద‌లు అంద‌రూ ఈ సినిమాను మ‌ని సినిమాగా భావించారు. మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో   ప్ర‌కృతి ,దైవం, ధ‌ర్మం గురించి చెప్ప‌డం చాలా అరుదు. అందుకు అవ‌కాశం క‌ల్పించిన భ‌గ‌వంతుడికి త‌ల‌వంచి న‌మ‌స్క‌రిస్తున్నా.మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఏదైనా టెస్ట్ చెయ్యాలంటే ప్లే గ్రౌండ్ రాయ‌ల‌సీమే. రాయ‌ల‌సీమ మెచ్చితే ప్ర‌పంచమే మెచ్చుతుంది. అందుకే ఈరోజు మీ ద‌గ్గ‌రకు రావ‌డం జ‌రిగింది. అందుకే బాల‌య్య‌గారు కూడా ఇక్క‌డే చేయాల‌ని అన్నారు. ముచ్చింత‌ల్‌లో షూటింగ్‌లో బిజీగా వున్నా ఆపేసి మీకోసం ఇక్క‌డ‌కు వ‌చ్చారు. బాల‌య్య‌గారు పురాణ పురుషుడు. న‌ట‌న‌లో నంద‌మూరి తారక రామారావు వార‌సుడేకాకుండా సేవా కార్య‌క్ర‌మంలోనూ ఆయ‌న పుణికిపుచ్చుకున్నాడు. అఘోరా పాత్ర‌కు చాలా ప్రిప‌రేష‌న్ చేశారు. బాల‌య్య‌గారు ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ, బోయ‌పాటిని న‌న్ను ఆ దేవుడే క‌లిపాడు అన్నారు. అందుకే మా జ‌ర్నీ ఇలాగే వుండాల‌ని భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నా. మీ అభిమానుల అభిమానం కూడా ఇలాగే వుండాల‌ని ఆశిస్తున్నా. తెలుగు ప్రేక్ష‌కుల అభిమానుల‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా అని తెలిపారు.
 
న‌టి పూర్ణ మాట్లాడుతూ, ఈ సినిమాలో భాగ‌మైనందుకు చాలా ఆనందమేసింది. అఖండ నా కెరీర్‌ను మార్చేసింది. శ్రీ‌కాంత్‌తో న‌టించ‌డం బాగుంది. నిర్మాత‌కు ధ‌న్య‌వాదాలు. అన్‌స్టాప‌బుల్ జై బాల‌య్య అంటూ నిన‌దిస్తూ,  బాల‌య్య‌బాబుగారికి  ఇంత‌మంది అభిమానులుండ‌డం గ్రేట్ అనిఅన్నారు.
 
నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ, భార‌తీయ సినిమాకు దిక్యూచిలాంటి సినిమాను అందించినందుకు ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా. నాకు తెలిసి 50, 100 రోజులు వేడుక జ‌రిగి ఎన్నో సంవ‌త్స‌రాలైంది. ఇప్పుడు పాండ‌మిక్ టైంలో అఖండ‌ వంద రోజులు ఆడ‌డం గొప్ప విష‌యం. క‌ర్నూలులో ఇదే గ్రౌండ్‌లో స‌క్సెస్‌మీట్ చేయాల‌నుకున్నాం. అప్ప‌ట్లో సాధ్య‌ప‌డ‌లేదు. అందుకే ఇప్పుడు అన్నీ అనుకూలించాయి కాబ‌ట్టి చేశాం. ఈ స‌క్సెస్‌కు కార‌ణ‌మైన టీమ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా. ఈమ‌ధ్య పాన్ ఇండియా క‌లెక్ష‌న్లు చూసుకుంటే అఖండ‌, పుష్ప‌కు వ‌చ్చిన‌ట్లు ఏ సినిమాకూ రాలేదు. బాల‌య్య‌బాబు అభిమానులు మీసం మెలేసి, తొడ‌కొట్టే సినిమా మ‌రొక‌టి చేయాల‌ని అనుకుంటున్నానని అన్నారు.
 
ప్ర‌జ్ఞ జైశ్వాల్ మాట్లాడుతూ, ఈ సినిమాపై మీరంతా చూపిన ఆద‌రాభిమాన‌ల‌కు ధ‌న్య‌వాదాలు. వంద‌రోజులు జ‌రుపుకోవ‌డం గ్రేట్‌. నా క‌ల నెర‌వేరింది. బాల‌య్య‌బాబుగారి స్పూర్తి క‌లిగించే వ్య‌క్తి. ఎన్నో విష‌యాలు ఆయ‌న్నుంచి నేర్చుకున్నా. థ‌మ‌న్ సంగీతంతో మ‌రో స్థాయికి తీసుకెళ్ళాడు అని తెలిపారు.
 
శ్రీ‌కాంత్ మాట్లాడుతూ, పాండ‌మిక్‌లో ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్‌కు తీసుకువ‌చ్చి ధైర్యాన్ని క‌లిగించింది. ప్ర‌పంచ‌లోని తెలుగుప్రేక్ష‌కులు అఖండ విజ‌యాన్ని సాధించి పెట్టారు. బోయ‌పాటి, బాల‌య్య కాంబినేష‌న్ చెప్ప‌న‌వ‌స‌రంలేదు. బోయ‌పాటికి న‌టీన‌టుల‌కు ఎటువంటి పాత్ర ఇవ్వాలో తెలుసు. నేను హీరోగా, బాబాయ్‌గా చేసుకుంటున్న త‌రుణంలో విల‌న్‌గా వ‌ర‌ద‌రాజులు పాత్ర ఇచ్చి ప్రోత్స‌హించారు. బాల‌య్య‌బాబు సెట్లోచాలా ఎన‌ర్జీతో వుంటారు. విల‌న్‌గా కెమెరామెన్ న‌న్ను అద్భుతంగా చూపించాడు. థ‌మన్ సంగీతం, స్ట‌న్ శివ ఫైట్స్ ఎసెట్‌గా నిలిచాయి. నిర్మాత ర‌వీంద‌ర్‌రెడ్డి మ‌రిన్ని మంచి సినిమాలు తీయాల‌ని ఆకాంక్షించారు.
ఇంకా కెమెరామెన్ రాంప్ర‌సాద్‌, చ‌మ‌క్ చంద్ర‌, కోటేశ్వ‌ర‌రావు, స్ట‌న్ శివ త‌దిత‌రులు మాట్లాడారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు