'బాహుబలి-2 రివ్యూపై ఫ్యాన్స్ కామెంట్స్.. : సినిమా కాదు.. దృశ్యకావ్యం... ఎక్స్‌టార్డినరీ...

శుక్రవారం, 28 ఏప్రియల్ 2017 (09:16 IST)
గత యేడాదిన్నరకాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం భెలిఫిట్ షోను అభిమానులు షో చూసేశారు. ఇంతవరకు ఈ చిత్ర యూనిట్ చెప్పిన మాటలు ఆసక్తిగా విన్న అభిమానులు స్పందించారు. సినిమా గురించి ఏమని చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. ఎక్స్‌టార్డినరీగా చిత్రాన్ని నిర్మించారన్నారు. 
 
తొలి భాగం కంటే 'బాహుబలి-2: ద కన్‌క్లూజన్' ఎంతో బాగుందని అంటున్నారు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. పాటలు తొలి విభాగం అంత వీనుల విందుగా లేకున్నప్పటికీ విజువల్స్‌తో అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. 
 
తొలి భాగంలో అనుష్క డీ గ్లామర్‌గా కనిపిస్తే, రెండో భాగంలో యువరాణిగా బాగుందని కితాబునిచ్చారు. రాక్షసుడిగా భళ్ళాల దేవుడు భయపెడితే... యువరాజుగా మహేంద్ర బాహుబలి ఆకట్టుకున్నాడని వారు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి