ఆంధ్ర‌లో యాభై శాతంతో థియేట‌ర్లు తెర‌చుకుంటున్నాయా!

సోమవారం, 5 జులై 2021 (16:22 IST)
Theater
ఇప్ప‌టివ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల థియేట‌ర్ల‌లో సినిమా టికెట్ రేట్ల విష‌యంలో నిర్మాతలు అసంతృప్తితో వున్నారు. కానీ వాటిని ప‌రిశీలించిన ప్ర‌భుత్వం థియేట‌ర్లను తెరిచిపనిలో వుంద‌ని తెలుస్తోంది. సోమ‌వారంనాడు సి.ఎం. పేషీనుంచి వెలువ‌డిన స‌మాచారం ప్ర‌కారం జులై 8నుంచి థియేటర్లు తెరుచుకునేలా స‌న్నాహాలు చేస్తుంద‌ని తెలుస్తోంది. కాగా, జులై 7న ఆంధ్ర‌, తెలంగాణ‌కు చెందిన ఎగ్జిబిట‌ర్లు జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డా ముఖ్యంగా ఆంధ్ర‌లోని థియేట‌ర్ల స‌మ‌స్య‌ల‌పై వారు చ‌ర్చించ‌నున్నారు. ఇందుకు సంబంధించిన క‌ర్టెన్ రైజ‌ర్‌గా ఇటీవ‌లే వారి డిమాండ్ల‌ను విడుద‌ల చేశారు.
 
ఇదిలా వుండ‌గా, తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల ప్రారంభం పై కీలక ఆదేశాలను జారీ చేసినట్లు తెలుస్తోంది. 50 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో జూలై 8 వ తేదీ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో థియేటర్లు తెరుచుకోనున్నాయి. అయితే అదే విధంగా తెలంగాణ రాష్ట్రం లో కూడా 100 శాతం సిట్టింగ్ కెపాసిటీ తో థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది. కానీ ఈ ష‌డెన్ నిర్ణ‌యం వ‌ల్ల చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు త‌మ సినిమాల విడుద‌ల తేదీని ప్ర‌క‌టించాల్సివుంటుంది. ఇప్ప‌టికే గోపీచంద్ ఆర‌డుగుల బుల్లెట్ సినిమాను ఆగ‌స్టులో విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇంకా ఆల‌స్య‌మైతే ఓటీటీవైపు అంద‌రూ ప‌రుగులుతీయాల్సివ‌స్తుంది. మ‌రి అధికారికంగా రెండు ప్ర‌భుత్వాలు కీల‌క ప్ర‌క‌ట‌న చేయాల‌ని సినీ పెద్ద‌లు ఎదురుచూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు