మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ థ్రిల్లర్ గాండీవధారి అర్జున. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 25న భారీ రేంజ్‌లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. గురువారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ గాండీవధారి అర్జున ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ప్రవీణ్ సత్తారు నాకు ఫోన్ చేసి ఈ కథ చెప్పినప్పుడు బాగా నచ్చేసింది. 2023లో జరిగిన ఓ ప్రాబ్లమ్ గురించి సినిమా తీస్తున్నప్పుడు ఓ నటుడిగా అలాంటి సినిమా చేయటం నా బాధ్యతగా అనిపించింది. అందుకే ఈ కథను ఓకే చేశాను. సినిమా ట్రైలర్ చూసి యాక్షన్ మాత్రమే ఉంటుందని అనుకోవద్దు. దానికి మించి సినిమాలో చాలానే ఉన్నాయి. మంచి ఎమోషన్స్ ఉంటాయి. దేశానికి వచ్చే సమస్య ఏంటనేది చూపించాం. రేపు దాన్ని థియేటర్స్‌లో మీరు చూస్తే మన చుట్టూ ఇలా జరుగుతుందా అని అనుకుంటారు. ఆగస్ట్ 25న మూవీ థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. సినిమా అందరికీ నచ్చుతుంది.
గాండీవధారి అర్జున సినిమా షూటింగ్‌ను ఎక్కువ భాగం విదేశాల్లో షూట్ చేశాం. కథ డిమాండ్ మేరకే అలా చేయాల్సి వచ్చింది. ఫారిన్ కంట్రీస్‌లో షూటింగ్ చేయటం కొత్తేమీ కాదు. ఇదేమీ స్పై మూవీ కాదు. ఇందులో నేను బాడీగార్డ్ రోల్ చేశాను. ఓ వారంలో జరిగే కథ ఇది. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమా ఇది. ప్రవీణ్ కథ చెప్పగానే చదువుకున్న నేను నా చుట్టు పక్కల వాతావరణంలో జరిగే మార్పులను పట్టించుకోవటం లేదేంటి అనిపించింది. మంచి కథ, స్క్రీన్ ప్లే ఉన్న సినిమా అనే కాదు.. మంచి పాయింట్ కూడా ఉంది. ఓ నటుడిగా ఇదొక బాధ్యత అనిపించింది అన్నారు.
నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ గాండీవధారి అర్జున సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది. యూరప్, అమెరికాల్లో షూటింగ్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. వరుణ్ తేజ్‌తో మేం చేసిన తొలి సినిమా తొలి ప్రేమ మంచి హిట్ అయ్యింది. సాయితేజ్‌తో చేసిన విరూపాక్ష కూడా మంచి హిట్ అయ్యింది. ఇప్పడు గాండీవధారి అర్జున కూడా మంచి హిట్ అవుతుంది అన్నారు.
చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ గాండీవధారి అర్జున ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సినిమా కూడా బావుంటుంది. సినిమాలో మంచి ఎమోషన్స్ ఉంటాయి. భూమిపై ఉన్న వనరులను మన ఇష్టానుసారం వాడేస్తున్నాం. భవిష్యత్ తరాల గురించి మనం ఆలోచించటం లేదు. గ్లోబల్ వార్మింగ్ గురించి జనరలైజ్ చేసి సినిమాను తెరకెక్కించాం అన్నారు.
నటుడు నరైన్ మాట్లాడుతూ గాండీవధారి అర్జున సినిమా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు. మంచి మెసేజ్ కూడా ఉంది. దాన్ని దర్శకుడు ప్రవీణ్ సత్తారుగారు మంచి కమర్షియల్ పంథాలో చక్కగా తెరకెక్కించారు. ఆగస్ట్ 25న సినిమాను థియటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.
హీరోయిన్ సాక్షి వైద్య మాట్లాడుతూ అవకాశం ఇచ్చిన బాపినీడుగారికి, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌గారికి థాంక్స్. అలాగే డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుగారు నన్ను అద్భుతంగా సిల్వర్ స్క్రీన్‌పై చూపించారు. వరుణ్ తేజ్‌గారు మంచి కోస్టార్. సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ కామేష్ మాట్లాడుతూ సినిమాలో వర్క్ చేయటం హ్యాపీగా ఉంది. అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ అన్నారు.