మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన బ్లాక్ బస్టర్ చిత్రం "ఫలక్నుమా దాస్"తో ప్రేక్షకులలో మంచి ఆదరణ సంపాదించాడు. ఇప్పుడు, విశ్వక్ గ్యాంగ్స్టర్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో దమ్మున్న గ్యాంగ్స్టర్ లంకల రత్నగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మే 31న ఫలక్నుమా దాస్ విడుదలైన తేదీనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. విశ్వక్ సేన్ గత సెంటిమెంట్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మేకర్స్ చాలా నమ్మకంతో ఉన్నారు.