ఏ మాయ చేసావె సీక్వెల్‌లో ''మాధవన్''.. ఆ కాంబో మళ్లీ రిపీట్..?

బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (15:34 IST)
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా "ఘర్షణ" ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ స్వరూప్ నిర్మించిన "ఏ మాయ చేసావె" సినిమా బంపర్ హిట్ అయ్యింది. సమంత, నాగచైతన్య జంటగా నటించిన ఈ సినిమా యూత్ మధ్య మంచి క్రేజ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తోంది. ఈ మూవీ సీక్వెల్‌లో మాధవన్ నటించనున్నాడు. ఈ విషయాన్ని మాధవనే స్వయంగా ప్రకటించాడు.  అలాగే టివినో థామస్, పునీత్ రాజ్‌కుమార్‌లు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్నారు. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. 
 
ఇకపోతే, గౌతమ్‌తో మాధవన్ 2001లో మిన్నలె(తెలుగులో చెలి) చిత్రానికి గానూ కలిసి పనిచేశారు. మళ్లీ గౌతమ్ మీనన్, మాధవన్ కాంబినేషన్ దాదాపు 17 సంవత్సరాల రిపీట్ అవుతోంది. మరి ఈ సినిమా తెలుగు సీక్వెల్‌ కోసం గౌతమ్ మీనన్ చైతూనే తీసుకుంటాడా? లేకుంటే వేరొక హీరోను ఎంచుకుంటాడా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు