#SV18 గ్రాండ్ రివీల్ వీడియో ద్వారా చేశారు. గీతా ఆర్ట్స్ నుండి శ్రీవిష్ణుకి గిఫ్ట్ అందుతుంది. గిఫ్ట్ బాక్స్ లోపల ఒక పజిల్ ఉందని తెలుసుకున్న శ్రీ విష్ణు ఆ పజిల్‌ని పరిష్కరించినప్పుడు, అది గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తన కొత్త సినిమా గురించి అని తెలుసుకుంటాడు. చాలా కాలంగా బిగ్ బ్యానర్‌లో పనిచేయాలని ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకి ఇది ఖచ్చితంగా బిగ్ బర్త్ డే ప్రెజెంటేషన్.
అదేవిదంగా శ్రీ విష్ణు, హసిత్ గోలి, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ నెం 32 టైటిల్ 'శ్వాగ్'-హ్యుమరస్ కాన్సెప్ట్ వీడియో విడుదల చేశారు. సింహం నుండి కిరీటం తీసుకున్న తర్వాత కొత్త నాయకుడిని ఎన్నుకోవడం గురించి అడవిలో జంతువుల మధ్య ఫన్నీ సంభాషణను చూపే కాన్సెప్ట్ వీడియో ద్వారా టైటిల్ అనౌన్స్ చేశారు. సింహం పాత్రకు సునీల్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, కోతి పాత్రకు గంగవ్వ వాయిస్ ఓవర్ ఇచ్చింది. చివరగా, టైటిల్ 'శ్వాగ్' అని రివీల్ అయ్యింది.
టీజర్, హిలేరియస్ కాన్సెప్ట్ వీడియోను బట్టి చూస్తే, శ్వాగ్ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని అర్ధమౌతోంది.
రాజ రాజ చోరా కోసం పనిచేసిన దాదాపు అదే టీమ్ 'శ్వాగ్' కోసం కూడా పని చేస్తుంది. వేదరామన్ శంకరన్ కెమెరా డీవోపీ పని చేస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకురుస్తున్నారు. విప్లవ్ నిషాదం ఎడిటర్. జిఎం శేఖర్ ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ని చూస్తుండగా, నందు మాస్టర్ స్టంట్స్‌ని పర్యవేక్షిస్తున్నారు.