నాని ''జెంటిల్‌మన్'' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నివేదా థామస్ ప్రస్తుతం అఖిల్‌తో రొమాన్స్ పండించేందుకు రెడీ అవుతోంది. ''వెర్రుదెఒరుభార్య''అనే మలయాళ చిత్రంతో నివేదా సినీ ప్రయాణం మొదలెట్టింది.
ఆపై హీరోయిన్‌గా మలయాళంతో పాటు తమిళ భాషల్లోనూ నటించింది. "జెంటిల్‌మన్"తో ఆమెకు తెలుగులో మంచి బ్రేక్ లభించింది. ప్రస్తుతం మరో సూపర్ ఛాన్స్ ఖాతాలోకి వెళ్ళిందని టాక్ వస్తోంది.
అఖిల్‌తో నివేదా జోడీ కట్టే సూపర్ ఛాన్స్‌ను సొంతం చేసుకుంది. విక్రమ్ కుమార్ అఖిల్ కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందని.. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నివేదితను ఖరారు చేయాలని యూనిట్ సంప్రదింపులు జరుపుతోంది.