అదే కాన్ఫిడెన్స్‌తోనే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా చేశాం

డీవీ

శనివారం, 6 జనవరి 2024 (18:12 IST)
Anjali, Srinivas Reddy, kona venkat
హీరోయిన్ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’.  ప్రముఖ రైటర్, ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పణలో ఈ సీక్వెల్‌ను ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ  ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. అంజ‌లి న‌టిస్తోన్న‌ 50వ సినిమా ఇది. హారర్ కామెడీ జోనర్ లో ట్రెండ్ సెట్ చేసిన గీతాంజలి సినిమాకు ఇది సీక్వెల్. ఈ ఏడాది ప్రథమార్థంలో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాను శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్‌ను పరిచయం చేసే ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. 
 
ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ, నేను షార్ట్ ఫిలిమ్ చేసినప్పుడు నాకు శివ తుర్లపాటి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి తనతో జర్నీ చేస్తున్నాను. గీతాంజలి సినిమా చేసే సమయానికి నేను 45 సినిమాలకు వర్క్ చేసి ఉన్నాను. కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనిపించి చేసిన సినిమాయే గీతాంజలి. శ్రీనివాస్ రెడ్డి నా దగ్గరకు రాజ్ కిరణ్‌ని తీసుకొచ్చాడు. హారర్ మూవీగా ఉన్న ఆ కథను కామెడీ హారర్‌గా మార్చాను. ఆ సమయంలో  బలుపు సినిమాలు రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకు నేను వర్క్ చేశాను. ఆ మూవీలో కీలక పాత్ర చేసిన అంజలి పెర్ఫామెన్స్ నచ్చటంతో గీతాంజలి సినిమా కోసం అప్రోచ్ అయ్యాం. అలా సినిమా టేకాఫ్ అయ్యింది. గీతాంజలి మూవీ ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

ఈ సీక్వెల్ రావటానికి పదేళ్లు పట్టింది. గీతాంజలి 2ను అమెరికాలో చేద్దామని అనుకున్నాను. కానీ టెక్నికల్, ప్రాక్టికల్ అంశాల కారణంగా సినిమాను ఊటీకి మార్చి చేశాం. సత్య, సునీల్, రవిక్రిష్ట, రాహుల్ మాధవ్, అలీ సినిమాకు అడిషన్స్ అయ్యారు. సినిమాను ఏ ఎక్స్‌పెక్టేషన్స్‌తో అయితే ఆడియెన్స్ చూడటానికి వస్తారో దాన్ని మించి ఎంజాయ్ చేస్తారు  అన్నారు. 
 
అంజలి మాట్లాడుతూ ‘‘‘గీతాంజలి’ నా కెరీర్‌లో తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ. చాలా పెద్ద హిట్ అయ్యింది. అదే కాన్ఫిడెన్స్‌తోనే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా చేశాం. సీక్వెల్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం. సినిమా చూశాను. చాలా బావుంది. సినిమా అంతా ఒక ఎత్తైతే .. క్లైమాక్స్ మరో రేంజ్‌లో ఉంటుంది. విజువల్, గ్రాండ్ నెస్ నెక్ట్స్ రేంజ్‌లో ఉంటాయి. సీక్వెల్‌లో పార్ట్ 2 వెయిట్ ను మోయటానికి స్టార్ క్యాస్ట్ పెరిగింది. అలీ, సునీల్, సత్య ఇలా అందరూ నవ్విస్తారు. డైరెక్టర్ శివ తుర్లపాటిగారికి ఈ సినిమా చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్ విజువల్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, రాజేష్ నా కోస్టార్స్‌గా పార్ట్ 1లో నటించారు. సీక్వెల్‌లోనూ నవ్విస్తారు. మూవీకోసం గ్రేట్ సెట్ వేసి శ్రీనుగారు, అద్భుతమైన సంగీతాన్ని అందించిన ప్రవీణ్ లక్కరాజుగారు, ఎడిటర్ చోటాగారు అద్భుతంగా చేశారు. గీతాంజలి ముద్దుగా కనిపించినా తను చేసే పనులు భయపెడతాయి. వాటిని థియేటర్స్ లో చూడాల్సిందే. కోన వెంకట్ గారు గీతాంజలి చిత్రాన్ని ఫ్రాంచైజీగా రూపొందిస్తూ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశారు. కోనగారి కామెడీ ట్రాక్, సినిమాను ఆయన డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంది’’ అన్నారు. 
 
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ‘‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ కథ వినగానే థ్రిల్ అయ్యాను. సినిమా నవ్విస్తూ భయపెట్టిస్తూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్ విజువల్స్ తో మాయ చేశారు. మూవీలో అంజలి, గీతాంజలి కాంబినేషన్‌ని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. అలీ, సునీల్ ఇలా చాలా మంచి టీమ్ వర్క్ చేసింది. ప్రవీణ్ లక్కరాజు సంగీతం పెద్ద ఎస్సెట్ అవుతుంది. కోనగారికి థాంక్యూ వెరీ మచ్. ఈ గీతాంజలి ఇలాగే ప్రేక్షకులను మెప్పించటానికి మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు