'ఈశ్వర్.. 20 ఏళ్లు అయిందిరా.. ఊరిని చూడాలనిపిస్తుందిరా.. చూపిస్తావా?.., కొన్ని రోజులు ఆగమ్మా.. ఊరినిండా రాక్షసులే ఉన్నారు.. వాళ్లని చంపి.. ఊరిని చూపిస్తానమ్మా.., చంపాల్సింది రాక్షసుల్ని కాదు.. రావణుడ్ని..,రాముడు రాలేకపోవచ్చు.. శివుడు శూలాన్ని పంపిస్తే.. చేయాల్సింది యుద్దం కాదు.. శివ తాండవం.. అంటూ సాగిన డైలాగ్స్.. చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. హీరో చంద్రహాస్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా ఉన్నాయి.
మంగంపేట టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్‌లో ఉంది. కెమెరామెన్ ఈ మూవీ కోసం వాడిన కలర్ గ్రేడింగ్, పెట్టిన షాట్స్, మ్యూజిక్ ఢైరెక్టర్ ఇచ్చిన ఆర్ఆర్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ మాస్ ఆడియెన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను ప్రకటించనున్నారు.
నటీనటులు : చంద్రహాస్ కే, అంకిత సాహా, నాగ మహేష్, కబీర్ దుహన్ సింగ్, కాలకేయ ప్రభాకర్, దయానంద్ రెడ్డి, ఎస్టర్ నోరోన్హా, పృధ్వీరాజ్, అడుకలం నరేన్, సమ్మెట గాంధీ, 14 రీల్స్ నాని, ఈశ్వర్ రాజనాల, సమీర్, దొరబాబు తదితరులు