అనసూయ గర్భిణీ..?

శుక్రవారం, 27 నవంబరు 2020 (17:38 IST)
ThankYouBrother
యాంకర్ అనసూయ సినీ నటిగా మంచి మార్కులే కొట్టేస్తోంది. రంగస్థలం సినిమాకు తర్వాత అనసూయకు సినీ ఆఫర్లు భారీగా వస్తున్నాయి. లేడి ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేసేస్తోంది. రంగస్థలం తర్వాత క్షణం, యాత్రం, కథనం లాంటి సినిమాలు చేసిన అనసూయ గ్లామర్ టచ్‌తో కూడిన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి మార్కెట్ సెట్ చేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన భామ.. తాజాగా లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతుంది.
 
అనసూయతో పాటు యంగ్ హీరో విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్న సినిమాకు ‘థ్యాంక్ యు బ్రదర్’ అనే టైటిల్ ఖరారైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా నుంచి అనసూయ లుక్ విడుదలైంది. 
 
రమేష్ రావర్తి డైరెక్షన్‌లో జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌‌టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా కరోనా నేపథ్యంలో తెరకెక్కుతోంది. గుణా బాలసుబ్రమనియన్ సంగీతం సమకూరుస్తుండగా, సినిమా పోస్టర్‌లో మాస్క్, లిఫ్ట్ హైలెట్ చేశారు. కాగా ఈ చిత్రంలో అనసూయ గర్భిణిగా కనిపిస్తోంది. తాజా పోస్టర్‌లో గర్భిణీగా అనసూయ కనిపిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు