ఎ.ఎన్.బాలాజీ, సినిమా రంగంపై ఆసక్తితో నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వ్యక్తి . ఏదో సినిమాలను చేసేయాలనే ఆతృతతో కాకుండా ఆలోచనతో నిర్మాతగా అడుగులు వేస్తున్నారీయన. సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంటే కాదు. ఎమోషన్ కూడా అని నమ్మిన ఎ.ఎన్.బాలాజీ ప్రేక్షకులను మెప్పించేలా, తన అభిరుచికి తగ్గట్లు సిద్ధార్థ్, జి.విప్రకాశ్ కుమార్ హీరోలుగా రూపొందిన `ఒరేయ్ బామ్మర్ది` చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకులకు అందించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినప్పటికీ సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తుంటే, ఎ.ఎన్.బాలాజీ ధైర్యంగా ముందడుగు వేసి ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయడం విశేషం. కమర్షియల్ అంశాలతో పాటు, ఎమోషనల్ యాంగిల్‌లో ఒరేయ్ బామ్మర్ది ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. అదే ఉత్సాహంతో మరో డిఫరెంట్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందిచడానికి సిద్ధమయ్యారు. ఆ చిత్రమే. `ఫ్రెండ్‌ఫిప్`. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకులు. ఇండియన్ మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేరోజున విడుదలవుతున్న ఫ్రెండ్‌షిప్ చిత్రాన్ని తెలుగులో ఎ.ఎన్.బాలాజీ సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.