కొంతమందికి సినిమా అవసరం.. కొంతమంది సినిమాకు అవసరం....

గురువారం, 26 మార్చి 2020 (18:47 IST)
కరోనా బాధితులను ఆదుకునేందుకునే ప్రభుత్వాలు అనేక రకాల సహాయక చర్యలను చేపడుతున్నాయి. అలాగే, కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ నేపథ్యంలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పలువురు సెలెబ్రిటీలతో పాటు.. రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన కోటీశ్వరులు తమకు తోచిన ఆర్థిక సాయాన్ని చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు కేటాయించగా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ.50 లక్షల చొప్పున ప్రకటించారు. 
 
దీనిపై టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. "కొంతమందికి సినిమా అవసరం .. కొంతమంది సినిమాకు అవసరం" అంటూ పవన్ వ్యక్తిత్వాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో త్వరలో ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ మూవీ గత రికార్డులను తిరగరాసిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు