యూనిక్ సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ గా బహుముఖం : హీరో- డైరెక్టర్ హర్షివ్ కార్తీక్

డీవీ

మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (17:20 IST)
Harshiv Karthik
హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన చిత్రం 'బహుముఖం'. గుడ్, బ్యాడ్ & ది యాక్టర్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సస్పెన్స్ డ్రామా థ్రిల్లర్ అట్లాంటా, మాకాన్, కాంటన్  జార్జియా,  USA పరిసర ప్రాంతాలలో అనేక అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 5న సినిమా విదుదలౌతుంది. ఈ నేపధ్యంలో హర్షివ్ కార్తీక్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
'బహుముఖం' జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ?
-తొలుత ఒక డిఫరెంట్ వేరియేషన్ షార్ట్ ఫిల్మ్ తీసి నన్ను నేను నిరూపించుకోవాలని భావించాను. షార్ట్ ఫిల్మ్ నిడివి తక్కువ వుంటుంది అలాగే ఇంపాక్ట్ ఎక్కువగా వుంటుంది. అయితే 'బహుముఖం' ఐడియా నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. మానసిక అనారోగ్యం వున్న వ్యక్తి ఓ ఆడిషన్ కు వెళ్తే అక్కడ అతనికి అవమానం జరిగితే తర్వాత అతను ఎంతవరకూ వెళ్తాడనే అనేది లైన్. కథ రాస్తున్నపుడు స్పాన్ పెరిగింది. ఇలాంటి కథ మన దగ్గర ఇప్పటివరకూ రాలేదనే నమ్మకం కుదిరిన తర్వాత దీనిని ఫీచర్ ఫిల్మ్ లెంత్ ఫిలిం చేయడం జరిగింది. ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్స్ ప్రేక్షకులు ఎక్కువగా చూస్తున్నారు. నటుడిగా దర్శకుడిగా ఓ యూనిక్ ప్రాజెక్ట్స్ తో రావాలని ఈ ప్రాజెక్ట్ చేశాను.
 
సినిమాల్లో పని చేసిన అనుభవం ఉందా?
-నేను యుఎస్ లో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తాను. సినిమాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. పార్ట్ టైం గా ఎవరిదగ్గరికైనా వెళ్లి పని చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాను. సమయం వృధా అయ్యింది కానీ సరైన ప్రాజెక్ట్ కుదరలేదు. ఇక నేనే సొంతగా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. జాబ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతిది ఆన్ లైన్ లో నేర్చుకున్నాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. జాబ్ తో పాటు ప్యాషన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేశాను.
 
నటన విషయంలో ఎలా ప్రిపేర్ అయ్యారు ?
-సినిమాలో నేను వుండకూడదు, కేవలం పాత్ర మాత్రమే కనిపించాలి. దీనికోసం ఆన్ లైన్ లో చాలా మెళకువలు నేర్చుకున్నాను. కొన్ని ఆర్ట్స్ ఫామ్స్ చాలా ప్రాక్టిస్ చేశాను. కథక్ నృత్యంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాను.  
 
సినిమా అంతా యుఎస్ లో తీశారా ?
-అవునండీ.. 'మేడిన్ యూఎస్ఎ.. అసెంబుల్ ఇండియా' అనే ట్యాగ్ తో ప్రమోషన్స్ చేస్తున్నాం. ఎక్కడ రాజీపడకుండా సినిమా చేశాను. ప్రతిది వర్క్ షాప్ నిర్వహించి చాలా క్లియర్ విజన్ తో సినిమాని రూపొందించాం. చాలా డిపార్ట్మెంట్స్ ని నేనే హ్యాండిల్ చేయడానికి కారణం కూడా కాస్ట్ తగ్గించాలనే. పక్కాగా ప్రీప్రొడక్షన్ వర్క్ చేయడం చాలా కలిసొచ్చింది. ఇందులో దాదాపు నలభై మంది కొత్తనటీనటులు కనిపిస్తారు. రోజుకి దాదాపు 14 గంటలు పాటు వర్క్ చేశాను. మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ వుండేలా సినిమాని రూపోందించాను. సస్పెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమా అంతా చాలా ఎంగేజింగ్ గా వుంటుంది.
 
ఫణి కళ్యాణ్, శ్రీచరణ్ పాకాల లాంటి ప్రముఖ సంగీత దర్శకులని ఎలా అప్రోచ్ అయ్యారు ?
-పాటలు ఫణి కళ్యాణ్ గారు చేశారు. ఆయన మెలోడీలని అద్భుతంగా చేస్తారు. ఈ సినిమా కోసం చాలా మంచి పాటలని స్వరపరిచారు. నేపధ్య సంగీత కోసం శ్రీచరణ్ పాకాల గారిని సంప్రదించాను. ఆయన నా గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే నా పాషన్, కమిట్మెంట్ ఏమిటో కూడా గ్రహించారు. టీజర్ చూపించాను. ఆయన చాలా నచ్చింది. తర్వాత కథ అంతా విన్నారు. చాలా బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశారు.    
 
సినిమాని ప్రేక్షకుల దగ్గరకి తీసుకెళ్లడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు?
-చాలా మంచి డిజిటల్ ప్రమోషన్స్ చేశాం. అలాగే ప్రమోషన్స్ లో నేరుగా ప్రేక్షకులని కలవడం వలన వారికి ఎలాంటి సినిమాలు కావాలి ? వారి అలోచన ధోరణి ఎలా వుందో కూడా తెలుసుకోగలిగాను. ఇవన్నీ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కి హెల్ప్ అవుతాయి. ఈ జర్నీ, ప్రాసస్ ని చాలా ఎంజాయ్ చేశాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు