Ravi Varma, Dhanya Balakrishna, Pooja Ramachandran
మధ అంటూ సైకలాజికల్ థ్రిల్లర్‌తో అందరినీ మెప్పించిన శ్రీ విద్య బసవ హత్య అనే మరో థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం జనవరి 24న రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాను మహాకాళ్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. గురువారం ఈ మూవీ టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు రవివర్మ చేతుల మీదుగా టీజర్ విడుదలైంది.