Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

దేవీ

శనివారం, 5 ఏప్రియల్ 2025 (07:48 IST)
sai sowjanya, ntr, nitin, trivikram
'మ్యాడ్ స్క్వేర్' చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వుల జల్లు కురిపిస్తున్న ఈ చిత్రం, భారీ వసూళ్లతో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు నిర్మాతలు. ఈ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభిమానుల కోలాహలం నడుమ ఘనంగా జరిగిన ఈ వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడారు.
 
NTR, trivikram, mad 2 team
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మన ఇంటి ఫంక్షన్ లో మన వాళ్ళని మనమే పొగొడుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. నేను ఒకే ఒక విషయం చెప్పి, ఈ ఉపన్యాసం ముగిస్తాను. నాకు ఇందాకటి నుంచి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ అని చూస్తూ ఉంటే 'జైంట్'(Jaint) గుర్తొస్తుంది. ఆయన నిజంగానే జైంట్." అన్నారు.
 
చిత్ర కథానాయకుడు నార్నె నితిన్ మాట్లాడుతూ, "మా ఈవెంట్ కి వచ్చిన బావ(ఎన్టీఆర్) గారి అభిమానులు థాంక్యూ సో మచ్. నాకు జనతా గ్యారేజ్ లోని ఒక డైలాగ్ చెప్పాలని ఉంది. ఫర్ ఏ చేంజ్.. ఆ బలహీనుడి పక్కన ఒక బలముంది. ఈ మాట నేను ఊరికే చెప్పట్లేదు. మా మ్యాడ్-1 షూటింగ్ పూర్తయింది. కానీ అప్పటికి సినిమాపై బజ్ లేదు. అప్పుడు బావగారు ట్రైలర్ లాంచ్ చేశారు. కావాల్సినంత బజ్ వచ్చింది. మా సినిమాకి జనాలు వచ్చారు. ఆ తర్వాత మీకు తెలిసిందే. సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు మ్యాడ్-2 తో వచ్చాము. థాంక్యూ సో మచ్ బావ(ఎన్టీఆర్). మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మ్యాడ్ స్క్వేర్ సినిమా చూసి నటనలో పరిణితి కనబరిచావని బావగారు అన్నారు. దానికి కారణం మా దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారు. షూట్ లో ఒక మెంటర్ గా ఉన్నారు. అలాగే నా సహ నటులు నాకెంతో సపోర్ట్ చేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చినబాబు గారికి, నాగవంశీ గారికి, హారిక గారికి థాంక్స్." అన్నారు.
 
చిత్ర కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ, "ఈ వేడుకకు విచ్చేసిన ఎన్టీఆర్ గారికి థాంక్యూ సో మచ్. మ్యాడ్ ట్రైలర్ ఆయన చేతుల మీదుగా లాంచ్ అయినప్పుడు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం కలిగింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కి వచ్చినందుకు మళ్ళీ థాంక్స్. మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు." అన్నారు
 
Nagavamsi, ntr and team
చిత్ర కథానాయకుడు రామ్ నితిన్‌ మాట్లాడుతూ, "నేను సినీ పరిశ్రమకు వచ్చిన తర్వాత మొదట కలిసిన స్టార్ ఎన్టీఆర్ గారు. మా మ్యాడ్ ట్రైలర్ లాంచ్ ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా జరిగింది. అది ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పుడు మళ్ళీ మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇంతకన్నా ఆనందం ఏముంటుంది. మాకు ఇంత సపోర్ట్ చేస్తున్న ఎన్టీఆర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప సినిమాలు అందించిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు." అన్నారు.
 
చిత్ర దర్శకుడు కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ, "ఈ వేడుకకు విచ్చేసిన ఎన్టీఆర్ గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్స్. నేను ముగ్గురికి ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలపాలి. నాగవంశీ గారు లేకపోతే నేను లేను, చినబాబు గారు లేకపోతే మ్యాడ్ లేదు, ఎడిటర్ నవీన్ నూలి గారు లేకపోతే ఇంత పెద్ద హిట్ లేదు. అలాగే, ఈ సినిమాలో భాగమై ఇంతటి విజయానికి కారణమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా థాంక్స్." అన్నారు.
 
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, "మ్యాడ్ ని పెద్ద హిట్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ ఇంకా పెద్ద హిట్ అవుతుందని విడుదలకు ముందు చెప్పాను. మా నమ్మకాన్ని నిజం చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారికి, నిర్మాతలు హారిక గారికి, నాగవంశీ గారికి, చినబాబు గారికి, త్రివిక్రమ్ గారికి థాంక్యూ సో మచ్. ప్రతి మనిషి బాగు కోరే ఎన్టీఆర్ గారు ఈ వేడుకకి రావడం సంతోషంగా ఉంది." అన్నారు.
 
ప్రముఖ నటుడు సునీల్ మాట్లాడుతూ, "ఈ సినిమాలో నేను పోషించిన మ్యాక్స్ పాత్ర మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిత్రం ద్వారా ఈ జనరేషన్ ని కూడా నవ్వించే అవకాశాన్ని నాకు ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు." అన్నారు.
 
ఈ వేడుకలో నటీనటులు ప్రియాంక జవాల్కర్, రెబా మోనికా జాన్, విష్ణు ఓఐ, సత్యం రాజేష్, కార్తికేయ, ఆంథోనీ రవి, రామ్ ప్రసాద్, గీత రచయిత కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు