ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరి రావు, మురళీ శర్మ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్షల్‌ను అత్యున్నత స్థాయి సాంకేతిక, నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా, సంగీత సంచలనం సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, అరుణ్ వెంజరమూడు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం: కార్తీ, కళ్యాణి ప్రియదర్శన్, సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరీ రావు, మురళీ శర్మ