సాధారణంగా సినీ హీరో లేదా హీరోయిన్‌కు అయినా సరే ఒకే ఒక్క హిట్ పడితే చాలు.. వారు తమ రెన్యునరేషన్‌ను అమాంతం పెంచేస్తుంటారు. ఈ విషయంలో హీరోయిన్లు ఒక అడుగు ముందుంటారు. ముఖ్యంగా, ఉత్తరాది భామల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇకపోతే, మలయాళ బ్యూటీ కీర్తి సురేష్ రూ.85 లక్షలు, ఫిదా భామ సాయి పల్లవి రూ.85 లక్షలు, నివేదా థామస్ రూ.70 లక్షలు, అనుపమ పరమేశ్వరన్ రూ.60 లక్షలు, అనూ ఇమ్మాన్యుయేల్ రూ.50 లక్షలు చొప్పున వసూలు చేస్తున్నారట.