నిజానికి లిక్కర్ చాక్లెట్లపై మన దేశంలో నిషేధం ఉన్నా అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ మాఫియా లిక్కర్ చాక్లెట్లను డెన్మార్క్ నుంచి అక్రమంగా తెప్పించి మెట్రోపాలిటన్ నగరాల్లో విక్రయిస్తోంది. ఇందుకోసం నగరానికి చెందిన ఓ చాక్లెట్ డిస్ట్రిబ్యూటర్ ముఠాతో ఒప్పందం కుదుర్చుకునిమరీ అమ్ముతోంది.
అధికారుల తనిఖీల్లో లండన్, ఐరిస్, డెన్మార్క్‌కు చెందిన మొత్తం 96 బాక్సుల్లో ఉన్న 1,081 చాక్లెట్లను అధికారి నంద్యాల అంజిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో చాక్లెట్‌లో 4 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు.