వరల్డ్‌ మిసెస్‌ యూనివర్సల్‌ పోటీల్లో హైదరాబాద్ అమ్మాయి..

బుధవారం, 22 మే 2019 (14:25 IST)
హైదరాబాద్ యువతి ప్రపంచ అందాల పోటీల్లో దూసుకెళ్తోంది. వరల్డ్‌ మిసెస్‌ యూనివర్సల్‌ పోటీల్లో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన రోహిణినాయుడు ఫైనల్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో జరగబోయే ఫైనల్స్‌లో ఆమె పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2019 మిస్‌ ఇండియా వరల్డ్‌ వైడ్‌ పోటీల్లో పాల్గొని దాని ద్వారా తాను యూనివర్సల్‌ ఫైనల్‌ పోటీలకు ఎంపికయ్యానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి దాదాపు 30 వేల మంది ఈ పోటీల కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో 172 మంది మాత్రమే ఫైనల్‌కు ఎంపియ్యారని, అందులో ఇండియా నుంచి తాను మాత్రమే ఎంపికైనట్లు చెప్పారు. 
 
వరల్డ్ మిసెస్ యూనివర్శల్ పోటీలు అక్టోబర్‌ నెలలో గ్రీస్‌లో జరగబోతున్నాయని, ఈ పోటీలకు ఎంపిక కావడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో భాగంగా నాలుగు వారాల పాటు వ్యక్తిత్వ వికాసం, మహిళా సాధికారత, లింగ సమానత్వం తదితర అంశాలలో ఒక్కో వారం ఒక్కో అంశంపై నాలుగు టాస్క్‌‌లు చేసి సోషల్ మీడియాలో అందుబాటులో ఉంచుతామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు