హైపర్ ఆది ఎవరంటే ఆయన జబర్ధస్త్ యాక్టర్ అని అందరూ టక్కున చెప్పేస్తారు. జబర్ధస్త్ షోలో కేవలం హైపర్ ఆది వేసే పంచ్‌ల గురించి ఈ షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వీలైనపుడల్లా.. మెగా హీరోలపై అభిమానం చూపిస్తూనే ఉంటాడు. జబర్ధస్త్ షోలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి స్క్రిప్ట్ రైటర్‌గా తన సత్తా చూపాడు.
ఆ సంగతి పక్కన పెడితే.. హైపర్ ఆది త్వరగా పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిలవ్వాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు సమాచారం. కానీ హైపర్ ఆది మాత్రం.. తన తోటి యాంకర్స్ సుధీర్, ప్రదీప్ పెళ్లి తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాడు. రీసెంట్‌గా హైపర్ ఆది తన పెళ్లి విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.