బుల్లెట్ భాస్కర్ రూటు మార్చాడు..

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:51 IST)
bullet bhaskar
జబర్దస్త్ స్టార్లు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర వంటి వాళ్లు ఇప్పటికే సినిమాల్లో నటించే ప్రయత్నంలో చాలావరకు సక్సెస్ అయ్యారు. అయితే తాజాగా జబర్థస్త్‌ ద్వారా క్రేజ్ తెచ్చుకున్న బుల్లెట్ భాస్కర్.. వీరికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు. రూటు మార్చాడు. 
 
జబర్ధస్త్ స్టార్స్ అంతా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటే... బుల్లెట్ భాస్కర్ మాత్రం సీరియల్స్‌లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా జీ తెలుగులో ప్రసారమవుతున్న కళ్యాణ వైభోగమే సినిమాలో బుల్లెట్ భాస్కర్ ఎంట్రీ ఇవ్వడం ఆడియెన్స్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది.
 
సీరియల్‌లో పోలీస్ గెటప్‌లో ఎంట్రీ ఇచ్చిన బుల్లెట్ భాస్కర్.. ఫస్ట్ ఎపిసోడ్‌లో కొంతవరకు కామెడీ పండించాడు. అయితే ఈ సీరియల్‌లో బుల్లెట్ భాస్కర్ రోల్ పూర్తిస్థాయిలో ఉంటుందా ? లేక ఒకటి రెండు ఎపిసోడ్లకు మాత్రమే పరిమితమవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. 
 
ఒకవేళ ఈ సీరియల్‌లు బుల్లెట్ భాస్కర్ పాత్ర కొనసాగితే.. ఇక ఈ జబర్ధస్త్ స్టార్ సీరియల్స్ వైపు అడుగులు వేస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది. మొత్తానికి జబర్ధస్త్ స్టార్స్ అంతా సినిమాల వైపు చూస్తుంటే.. బుల్లెట్ భాస్కర్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు