వచ్చే వారం మాత్రం హైపర్ ఆది స్థానంలో అభి కనిపించబోతున్నాడట. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్‌లలో హైపర్ ఆది కనిపించకుండా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి పూర్తిస్థాయిలో కనిపించకుండా ఉండిపోవాలన్న ఆలోచనకు వచ్చేశారట ఆది. సినిమాల్లో బిజీగా ఉన్న హైపర్ ఆది ఇక అస్సలు జబర్దస్త్ జోలికి వెళ్ళకూడదని నిర్ణయించేసుకున్నారట. హైపర్ ఆదిని తిరిగి జబర్దస్త్ లోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. షో చేసేందుకు మాత్రం హైపర్ ఆది ఇష్టపడటం లేదట.