వేధింపులకు తానూ గురయ్యానంటూ ముందుకొచ్చింది నటి ఇలియానా.. నటిగా రంగప్రవేశం చేసిన కొత్తల్లో అలాంటి భయంకరమైన సంఘటనను ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఇంటి సమీపంలో నివసించే ఒక కుర్రాడు రోజూ వెంటపడి వేధించేవాడని, మొదట్లో పెద్దగా పట్టించుకోనప్పటికీ చాలా రోజులు మౌనంగా వేదనను భరించానని చెప్పింది.
కానీ రోజులు గడిచే కొద్దీ అతడి ఆగడాలు మితిమీరడంతో ఒక రోజు అమ్మకు చెప్పేశానని, అమ్మ అతడిని పిలిపించి గట్టిగా హెచ్చరించిందని ఇలియానా చెప్పింది. అంతటితో అతగాడు చేతనైతే పోలీసులకు ఫిర్యాదు చేసుకో అని చెప్పడంతో అమ్మ కచ్చితంగా ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో ఆ మరుసటి రోజు నుంచి అతడి జాడ లేకుండా పోయిందని, కానీ కొద్ది రోజులు మాత్రం ఎంతో భయంగా గడిపానని ఇలియానా తెలిపింది.
టాలీవుడ్‌లో తన గ్లామర్‌తో ఒక వెలుగు వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా.. తర్వాత బాలీవుడ్ పై మక్కువతో దక్షిణాది సినిమాలకు దూరమైంది. అయితే అక్కడ కూడా ఆమెకు సరైన అవకాశాలు రాకపోవడంతో మళ్లీ దక్షిణాది సినిమాల పైవు చూస్తోంది. ఇటీవల తారల లైంగిక వేధింపు గొడవ పెద్ద సమస్యగా మారడంతో తాను కూడా బాధితురాలేనంటూ వార్తల్లోకి వచ్చింది.