నాకు కరోనా పాజిటివ్ వచ్చింది, హోం క్వారెంటైన్లో వున్నా, డోంట్ వర్రీ: సోనూ సూద్

శనివారం, 17 ఏప్రియల్ 2021 (13:58 IST)
ప్రముఖ నటుడు సోనూ సూద్ కి కరోనా పాజిటివ్ గా పరీక్షల్లో నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. శనివారం ఉదయం పరీక్ష చేయించుకోగా కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్థారణ అయ్యిందనీ, ప్రస్తుతం హోం క్వారెంటైన్లో వున్నట్లు తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన చెందవద్దనీ, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే వుందని ట్వీట్ చేసారు.

మరోవైపు జనసేన నేత, పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌కి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స జరుగుతోంది. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొని హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత నలతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. 
 
అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయక్షేత్రంలోనే క్వారంటైన్‌కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. 
 
ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు, కార్డియాలజిస్టు డాక్టర్ తంగెళ్ళ సుమన్ హైదరాబాద్‌కు వచ్చి పవన్ కళ్యాణ్‌కి చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నెమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు