నేను మీతో మాట్లాడుతూనే చనిపోవచ్చు, పవన్ గురించి నన్నేమీ అడగొద్దు: రేణూ దేశాయ్

శుక్రవారం, 13 అక్టోబరు 2023 (12:37 IST)
రేణూ దేశాయ్. ఆమె వయసు 42 ఏళ్లు. జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ మాజీభార్య. ఆయన నుంచి విడిపోయాక ఆమె ఎన్నో సవాళ్లను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కొన్నిసార్లు ఫ్యాన్స్ విసిరే విమర్శలకు ఇబ్బందిపడ్డారు. ఇంకొన్నిసార్లు ఆమెను రాజకీయాల్లోకి లాగి ఇబ్బందుల పాల్జేసారు. ఐతే అవన్నీ సహిస్తూనే చెరగని చిరునవ్వుతో జీవితాన్ని ముందుకు లాగిస్తున్నారు రేణూ. తాజాగా ఆమె రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో లవణం ఫ్యామిలీకి చెందిన పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె వెల్లడించిన పర్సనల్ విషయాలు మీకోసం.
 
''ఆ పాత్ర నన్ను ఎంతో మార్చింది. నేను యాక్టింగ్‌కు దూరం కాలేదు. నాకు పర్సనల్‌గా హెల్త్ సమస్య ఉంది. హార్ట్ ప్రాబ్లెమ్ ఉంది. అందుకే దేనికీ ఎమోషన్ కాను. ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. ఎత్తైన ప్లేస్‌లో నడిస్తే ఆయాసం వస్తుంది. నాకు జనటిక్ సమస్య ఉంది. 47 సంవత్సరాల వయసులో మా నానమ్మ ఇదే సమస్యతో చనిపోయారు.
 
మా నాన్నగారు కూడా అలాగే చనిపోయారు. నాకు 42 ఏళ్లు. రేపు నాకు ఏమి జరుగుతుందో చెప్పలేను. నేను ట్రావెల్ చేస్తూ చేస్తూ చనిపోవచ్చు. ఇప్పుడు మీతో మాట్లాడుతూ కూడా హఠాత్తుగా చనిపోయినా ఆశ్చర్యంలేదు. ఏదైనా కావచ్చు. నాకు నా పిల్లలు, ఫ్యామిలీ ముఖ్యం. అందుకే పవన్ కళ్యాణ్ గురించి నన్నేమీ అడగవద్దు. తను చాలా గుడ్ పర్సన్'' అని తెలిపారు రేణూ దేశాయ్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు