సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటిస్తోన్న చిత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రణవి మానుకొండ మీడియాతో ముచ్చటించారు.