యాక్షన్ రోల్, కామెడీ పాత్రలు చేయాలని వుంది : హీరోయిన్ రీతూ వర్మ

దేవి

బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (17:37 IST)
Ritu Verma
నా సినిమా జర్నీతో  చాలా హ్యాపీగా వున్నాను. నటిగా చాలా మంచి సినిమాలు పాత్రలు చేశాను. అందులో గుర్తు పెట్టుకునే కొన్ని పాత్రలు వుండటం ఆనందాన్ని ఇస్తుంది. పెళ్లి చూపులు2 గురించి చాలామంది అడుగుతున్నారు.  నాకు కూడా దాని కోసం ఎదురుచూస్తున్నాను. ప్లాన్ చేస్తే చాలా బావుటుంది అని హీరోయిన్ రీతూ వర్మ అన్నారు. 
 
సందీప్ కిషన్ తో ‘మజాకా’ సినిమా చేసారు.  త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రీతూ వర్మ సినిమా విశేషాల్ని తెలియజేసారు.
 
-ప్రసన్న గారు ఈ కథ చెప్పినపుడు చాలా ఎంటర్ టైనింగ్ గా అనిపించింది. అదే సమయంలో కథ హై ఎమోషనల్ కోషేంట్ గా వుంది. రెండు ఫీమేల్ క్యారెక్టర్స్ కి కథ లో చాలా ఇంపార్టెన్స్ వుంది. నరేషన్ చాలా నచ్చింది. త్రూ అవుట్ నవ్వుతూనే వున్నాను.
 
- సినిమాలో  మెమరబుల్ మూమెంట్ అంటే... సెకండ్ హాఫ్ లో నాకు రావు రమేష్ గారికి ఓ సింగిల్ టేక్ సీన్ వుంది. ఆ రోజు షూట్ చేసినప్పుడు అవుట్ పుట్ విషయంలో అందరూ చాలా హ్యాపీ అయ్యారు. సీన్ చాలా అద్భుతంగా వచ్చింది. రావు రమేష్ గారు డబ్బింగ్ పూర్తి చేసి ఫోన్ చేశారు. ఆ సీన్ గురించి మాట్లాడుతూ.. 'చాలా అద్భుతంగా చేశావ్ అమ్మా..16 నా ఏళ్ల కెరీర్ లో అలాంటి సీన్ చూడాలేదు'అని ఆయన చెప్పడం నాకు చాలా మెమరబుల్.
 
-ఈ సినిమా షూటింగ్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. సెట్స్ లో అందరూ ఎనర్జిటిక్ గా వుండేవారు. అదే ఎనర్జీ ప్రమోషన్స్ లో కూడా కనిపిస్తుంది. బాటిల్ రీల్ కి మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా వుంది.
 
త్రినాథ్ రావు గారి సినిమా ఫుల్ ఎంటర్ టైనింగ్ గా వుండబోతోంది. లాట్స్ అఫ్ కామెడీ. హై ఆన్ ఎమోషన్. సాంగ్స్ చాలా  గ్రాండియర్ గా వుంటాయి. టీజర్ అందరికీ నచ్చింది. చాలా పాజిటివ్ వైబ్స్ వున్నాయి. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేశారు.
 
-ఇందులో యంగ్ కాలేజ్ గర్ల్ గా కనిపిస్తా. బాల్యంలో ఎమోషనల్ కాన్ ఫ్లిక్ట్ వలన తనపై ఎలాంటి ఎఫెక్ట్ పడింది? సందీప్ క్యారెక్టర్ తో తన రిలేషన్ షిప్ ?.. ఇలా చాలా ఇంట్రస్టింగ్ గా వుంటుంది. నా క్యారెక్టర్ ని కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇప్పటివరకూ చేయని క్యారెక్టర్ లో కనిపిస్తా. ఆడియన్స్ కి నచ్చుతుందనే నమ్మకం వుంది.
 
-సందీప్ గారు చాలా పాజిటివ్ పర్శన్. లవ్లీ కోస్టార్. చాలా ఎనర్జిటిక్ గా వుంటారు. చాలా సపోర్టివ్. ఆయనతో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్
 
-సాంగ్స్ ని చాలా ఎంజాయ్ చేశాను. సాంగ్స్ అద్భుతంగా వచ్చాయి. పాటలన్నీటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. రావులమ్మ పాట రాబోతోంది. ఆ పాట కూడా చాలా బావొచ్చింది.
 
-నాకు యాక్షన్ రోల్ చేయాలని వుంది. అలాగే కామెడీ కూడా చేయడం నాకు చాలా ఇష్టం. అలాగే ఫుల్ లెంత్ పీరియడ్ సినిమా చేయాలని వుంది.
 
-తెలుగులో ఓ మల్టీ స్టారర్ సైన్ చేశాను. అలాగే ఓ వెబ్ సిరిస్ చేశాను. అది హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు