అల్లు అర్జున్ ఉద్దేశించి అనసూయ మాట్లాడుతూ, ఇదంతా కలగా వుంది. రెండేళ్ళుగా పుష్ప కోసం ఎదురు చూస్తున్నాను. అమ్మ నాన్నను, దేవుడిని కోరికలు అడుగుతాం. ఇలా స్టేజీమీద అడిగితే అప్పుడు రంగస్థలంలో ఛాన్స్ వచ్చేసింది. ఇప్పుడు పుష్ప. ఇలాగే కంటెన్యూ అవుతుంటే చాలా అడగాలి. అంటూ.. సిసిమాలో ఛాన్స్ లు అని చెప్పింది. ఇక నా గ్లామర్‌ను బుల్లితెరపై చూసేశారు. సినిమాల్లో తగ్గేదేలే అంటూ క్లారిటీ ఇచ్చింది. అంటే ఎక్స్‌పోజింగ్ చేస్తానన్నట్లు హింట్ ఇచ్చినట్లుంది. ఇక సునీల్ కాంబినేషన్‌లో ఆమె నటించినట్లు మాటల బట్టి అర్థమైంది. దేవీశ్రీ సంగీతం హైలైట్. నిర్మాతలు నవీన్, చెర్రీ అద్భుతమైన సినిమా తీశారు. దర్శకుడు సుకుమార్ గురించి చెప్పాల్సిన పనిలేదు అని తెలిపింది.