పాన్ ఇండియా మూవీలో చేస్తున్నా- ఇక్క‌డ క్యూలో నిల‌బ‌డి టికెట్లు కొంటారు - శ్వేతా అవ‌స్తి

శనివారం, 7 ఆగస్టు 2021 (17:49 IST)
Shweta Awasthi
'హుషారు' ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’.  కొత్తూరి ఎంటర్ టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా  శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి స‌క్సెస్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ శ్వేతా అవ‌స్తి ఇంట‌ర్వ్యూ విశేషాలు.
 
- ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ముఖ్యంగా కామెడీ, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌ను ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. 
- మాది పూణే. నేను రీసెర్చ్ స్టూడెంట్‌ని, చ‌దువుకునేట‌ప్పుడు మోడిలింగ్ స్టార్ట్ చేశాను. హైద‌రాబాద్‌కు క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ చేయ‌డానికి వ‌స్తుండేదాన్ని. ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌కు సంబంధించిన ఫొటోను చూసి 2018లో హీరోయిన్‌గా తొలి అవ‌కాశం వ‌చ్చింది. అదే ‘మళ్లీ మళ్లీ చూశా’. ఈ సినిమా 2019లో విడుద‌లైంది. ఇప్పుడు ’మెరిసే మెరిసే’ నా రెండో సినిమా. 
 
- తొలి సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో డైరెక్టర్ పవన్ కుమార్ నన్ను ఈ సినిమా కోసం అప్రోచ్ అయ్యాడు. కథ విన్న తర్వాత వర్క్ షాప్‌కు అటెండ్ అయ్యాను. 
- దినేశ్ తేజ్ హుషారు, ప్లేబ్యాక్ సినిమాలు ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాయి. త‌ను మంచి కోస్టార్‌. నాకు భాష ప‌రంగా డైలాగ్స్ చెప్పే స‌మ‌యంలో బాగా హెల్ప్ చేశాడు. స‌న్నివేశం పూర్త‌యిన త‌ర్వాత నెక్స్‌ట్ సీన్ ఎలా చేయాల‌ని ఇద్ద‌రం డిస్క‌స్ చేసుకునేవాళ్లం. సెట్‌లో అంద‌రూ అంతే స‌పోర్టివ్‌గా ఉన్నారు. న‌టిగా విష‌యాల‌ను నేర్చుకున్నాను. 
- డైరెక్ట‌ర్ ప‌వ‌న్‌కుమార్ మంచి టాలెంటెడ్ ప‌ర్స‌న్‌. ద‌ర్శ‌కుడిగా తొలి సినిమానే అయినా కూడా చాలా క్లారిటీతో సినిమాను పూర్తి చేశాడు. యాక్ట‌ర్ నుంచి త‌న‌కు కావాల్సిన అవుట్‌పుట్‌ను ఎలా రాబ‌ట్టుకోవాలో ఆయ‌న‌కు మంచి ఐడియా ఉంది. 
- రాజ‌మండ్రి నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చే హీరోయిన్ స్వ‌తంత్య్ర భావాలున్న అమ్మాయి. త‌న‌కు లైఫ్‌లో ఏదో పెద్ద‌గా సాధించాల‌నే కోరిక ఉంటుంది... ఇలా నా పాత్ర‌ను డైరెక్ట‌ర్ డిజైన్ చేసిన తీరు నాకు బాగా న‌చ్చింది. నేను కూడా ఎక్కువ‌గా నేను చెప్పాల‌నుకున్న విష‌యాల‌ను ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఎక్కువ‌గా, మాట‌ల‌తో త‌క్కువ‌గా చెబుతాను. సినిమాలో హీరోయిన్ వెన్నెల పాత్ర కూడా అంతే. అలా కొన్ని విష‌యాలు నాకు బాగా క‌నెక్ట్ అయ్యాయి. 
 
- ఉత్త‌రాది ప్రేక్ష‌కుల కంటే ద‌క్షిణాది ప్రేక్ష‌కులు సినిమాను ఎక్కువ‌గా ప్రేమిస్తారు. ఇక్క‌డ స్టార్స్‌ను ఆరాధిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు ర‌జినీకాంత్ లాంటి పెద్ద హీరో సినిమా అంటే మూడు నాలుగు గంట‌ల ముందే క్యూలో నిల‌బ‌డుకుని టికెట్స్ కొంటారు. ఇక్క‌డ సినిమా అంటే ఎమోష‌న్, సెల‌బ్రేష‌న్‌
 
- ‘మ‌హాన‌టి’ చిత్రంలో కీర్తిసురేశ్‌గారు ఎంత చ‌క్క‌గా చేశారు. న‌టిగా.. అలాంటి ఓ వైవిధ్య‌మైన పాత్ర‌ను చేయాల‌నుకుంటున్నాను. 
 
- ఓ పాన్ ఇండియా మూవీలో న‌టిస్తున్నాను. ఇప్ప‌టికే ల‌డ‌క్‌లో షూటింగ్‌ను పూర్తి చేశాం. అలాగే ఇంకా మంచి సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు