వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుంచి ఇబ్బందులు ఎదరవ్వడం.. వర్మ ఫైట్ చేయడం... ఆఖరికి సెన్సార్ బోర్డ్ దిగొచ్చి సెన్సార్ చేస్తాననడం తెలిసిందే. అయితే... ఈ విషయం గురించి సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు పీపుల్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి. హైదరాబాద్‌లో అతిలోక సుందరి శ్రీదేవి పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన సినిమాల విడుదల విషయంలో సెన్సార్ బోర్డ్ వ్యవహరిస్తున్న తీరుపై ఫైర్ అయ్యారు.
సెన్సార్ వ్యవహరిస్తున్న ఈ దుర్మార్గమైన తీరును ఇండస్ట్రీ మొత్తం ఖండించాలి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సినిమా తీస్తే సెన్సార్ ఆపేస్తారా? వీటిపై వివరణ ఇచ్చేందుకు అమరావతి వెళ్లాలా..? కాబట్టి ప్రొడ్యుసర్ కౌన్సిల్ నుండి ఫిల్మ్ ఛాంబర్ వరకూ ముక్త కంఠంతో సెన్సార్ విధానాన్ని తిరస్కరించాలని పిలుపునిచ్చారు ఆర్ నారాయణ మూర్తి.