స్టార్స్ ఉన్నా కంటెంట్ లేకపోతే సినిమాలు ఆడవుః ఐ క్యూ ఆడియోలో ఘంటా శ్రీనివాస్

గురువారం, 20 అక్టోబరు 2022 (20:17 IST)
Ghanta Srinivas launched IQ Audio
కాయగూరల సాయిచరణ్‌, పల్లవి, ట్రాన్సీ హీరో హీరోయిన్స్ గా దర్శకుడు జి.ఎల్ .బి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న వైవిధ్యభరిత చిత్రం  'ఐక్యూ' .  కెఎల్పి మూవీస్ బ్యానర్ పై కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్న ఈ  సినిమాలో కాయగూరల లక్ష్మీపతి , పల్లె రాఘనాథ్ రెడ్డి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. సుమన్  సూర్య, బెనర్జీ, సత్యప్రకాష్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈమూవీ ఆడియోను ఏపి మాజీ మంత్రివర్యులు ఘంటా శ్రీనివాస్ ఆవిష్క‌రించారు. పోలూరు ఘటికా చలం సంగీతం అందించారు.
 
అనంత‌రం  ఘంటా శ్రీనివాస్ మాట్లాడుతూ, నిర్మాత కె.ఎస్ .రామారావుతోపాటు నా చేతుల‌మీదుగా ప్రారంభమైన ఈ ఐక్యూ సినిమా 20 రోజుల్లో షూటింగ్ పార్ట్  పూర్తి చేసుకోవడం గొప్ప విషయం.  స్టార్స్ ఉన్నా కంటెంట్ లేకపోతే సినిమాలు ఆడవు. కానీ ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్స్  చూశాక మంచి కంటెంట్ ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు.. హీరో సాయిచరణ్‌ మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు .. మంచి భవిష్యత్తు ఉందన్నారు.. సినీ ఇండస్ట్రీ ప్రముఖలతో మాట్లాడి సినిమా రిలీజ్ కోసం తనవంతు సహాకారం అందిస్తానని హామి ఇచ్చారు.
 
నిర్మాత కాయగూరల లక్ష్మీపతి మాట్లాడుతూ, అనంతపురంలో షూటింగ్ పెడితే   సుమన్, సత్య ప్రకాష్ బాగా సహకరించారు. నా రెండో అన్నయ్య శ్రీనివాస్ కోడుకు సాయిచరణ్ హీరో అయ్యాడు.  రచయిత ఘటికాచలం తను క్లాస్ మేట్స్ అని ..విషయం చెప్పగానే ..మంచి కథ చెప్పాడు. ఆ కథ నచ్చి షూటింగ్ ప్రారంభించాం. . నవంబర్ చివరివారంలో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
 
సుమన్  మాట్లాడుతూ, పోలిటికల్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన లక్ష్మీపతి సినిమా ను బాగా క్వాలిటిగా తీశారు. కాలేజి స్టూడెంట్స్ నేపధ్యంలో రూపోందిన ఈ సినిమా అన్నివర్గాలకు నచ్చుతుందని అన్నారు.. 
 
చిత్ర దర్శకులు జిఎల్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ  .. ఐక్యూ చిత్రానికి క్లాప్ కొట్టిన ఘంటా శ్రీనివాస్ గారు ..తిరిగి మళ్లీ అడియో పంక్షన్ కి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.. హీరోహీరోయిన్స్ కొత్తవారైన చాలా బాగా నటించారని , సీనియర్ నటులు సుమన్ , సత్యప్రకాష్ బాగా సహాకరించాని అన్నారు... తన గాడ్ ఫాదర్‌ ఘటికాచలం వల్లే ఈ సినిమా అవకాశం వచ్చిందని తెలిపారు.. ఈ సినిమాలో మూడు పాటలు ఉన్నాయని ..వాటికి ఘటికాచలం గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారని అన్నారు. 
 
ఇంకా సాయిచరణ్‌, పల్లవి, ట్రాన్సీ, ఘటికాచలం, ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బసిరెడ్డి, మంచాల సుధాకర్ నాయుడు, నిర్మాతలు అశోక్ కుమార్, రామసత్యనారాయణ, దర్శకులు వి సముద్ర,  సత్యప్రకాష్ త‌దిత‌రులు మాట్లాడుతూ చిత్ర విజ‌యవంతం కావాల‌ని ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు