ఇలియానాకు అలాంటి రోల్స్ కావాలంట..? డైరక్టర్లు ఛాన్స్ ఇస్తారా?

శనివారం, 24 ఏప్రియల్ 2021 (16:51 IST)
‘దేవదాసు’ మూవీతో తెలుగు తెరపై మెరిసిన గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత అగ్రనటిగా రాణించింది. తెలుగుతో పాటు తమిళంలోను ఫుల్‌ బిజీ ఆయిపోయిన ఇలియానాకు అదే సమయంలో బాలీవుడ్‌లో నటించే అవకాశం వచ్చింది. రణ్‌బిర్‌ కపూర్‌ సరసన అనురాగ్‌ బసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బర్ఫీ’ సినిమాలో నటించే చాన్స్‌ కొట్టెసింది. ఈ సినిమాలో ఇలియానా తన నటనతో హిందీ ప్రేక్షకులను మెప్పించింది. 
 
అయితే ఆ తర్వాత అక్కడ ఆమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఆ మధ్య ఇలియానా పూర్తిగా సినిమాలు తగ్గించి ప్రముఖ అస్ట్రేలియా ఫొటో గ్రాఫర్‌తో ప్రేమలో మునిగి తేలిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల అతడికి బ్రేకప్‌ చెప్పిన ఇలియానా మళ్లీ సినిమాలపై మొగ్గు చూపింది.
 
ఈ క్రమంలో రవితేజతో ‘అమర్ అక్బర్ అంటోనీ’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన ఆమె ఇటీవల బాలీవుడ్‌లో అభిషేక్‌ బచ్చన్‌తో బిగ్‌ బుల్‌లో నటించింది. ప్ర​స్తుతం హిందీలో రణ్‌దీప్‌ హుడాతో ‘అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’ మూవీలో నటిస్తోన్న ఆమె ఇటీవల ఓ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.  
 
ఈ సందర్భంగా.. తాను ఎక్కువ సినిమాలు చేయకపోవడంపై స్పందించింది. కథలో పాత్రకు ప్రాధాన్యం వుండేలా చూసుకుంటున్నానని తెలిపింది. తన దగ్గరకు వచ్చిన కథలను ఆచితూచి ఎంపిక చేస్తున్నానని.. రొటీన్‌కు భిన్నంగా వుండేలా చూసుకుంటున్నానని వెల్లడించింది. అంతేకాక.. పూర్తిస్థాయిలో యాక్షన్ చిత్రంలో నటించాలని ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు